Breaking News

Loading..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు, వసతులు మరిచారు : సిపిఎం

 

                   బిసిఎం10 న్యూస్  జూలై 31 భద్రాచలం 

  •  ఫ్రీ కరెంట్ లేని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
  • సమస్యల వలయంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు
  • సిపిఎం సర్వేలో వెల్లడి 
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి నెలలు గడుస్తున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని,ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి వసతులు మరిచారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు అన్నారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 8వ వార్డు మనుబోతుల చెరువు డబుల్ బెడ్ రూమ్ కాలనీ నందు సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. 


సమస్యలు పరిష్కరించాలని అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న వారికి ఫ్రీ కరెంటు ఇవ్వకుండా బిల్లులు కట్టమని అంటున్నారని మనుబోతుల చెరువు కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రజలు సిపిఎం సర్వే బృందం కు విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హడావిడిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రభుత్వం వైఫల్యం చెందారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఫ్రీ కరెంట్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రిపూట దొంగలు, రౌడీ మూకలు వచ్చి తలుపులు కొట్టి హంగామా సృష్టిస్తున్నారని,భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల చుట్టూ మట్టి పోసి చదును చేయకపోవడం వల్ల వర్షపు నీరు నిలువ ఉండి మురుగు వాసన వచ్చి దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలు వస్తున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఈ బ్లాక్ ముందు రోడ్లు వేయలేదని తక్షణమే రోడ్లు వేయాలని కరెంటు స్తంభాలు వేసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.



సెప్టిక్ ట్యాంకుల పైన పైపులు విరిగిపోయాయని మూతలు తీసి ఉండడంతో పిల్లలు అందులో పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వద్ద పారిశుధ్యం చేపట్టి బ్లీచింగ్ దోమల మందు పిచికారి చేయాలని కోరారు. మిషన్ భగీరథ పైపులు వేసి కనెక్షన్లు ఇవ్వలేదని తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పార్టీ సభ్యులు సక్కుబాయి, నాగమ్మ,చిట్టెమ్మ, సీనమ్మ, భద్రమ్మ, కుమారి, బత్తిని బాలరాజు దేవుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments